తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్

  • 24 గంటల్లో 617 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,82,347
  • మృతుల సంఖ్య మొత్తం 1,518
  • జీహెచ్ఎంసీలో కొత్తగా 103 కరోనా కేసులు  
తెలంగాణలో గత 24 గంటల్లో 617 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 635 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,82,347కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,74,260 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,518కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం  6,569  మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 4,400 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 103 కరోనా కేసులు నమోదయ్యాయి.

     


More Telugu News