కొత్త రకం వైరస్ ఎఫెక్ట్.. అంతర్జాతీయ విమాన సర్వీసులపై సౌదీ, కువైట్ నిషేధం
- నియంత్రించలేని విధంగా చెలరేగిపోతున్న కొత్త వైరస్ స్ట్రెయిన్
- భయం గుప్పిట్లో ప్రపంచ దేశాలు
- బ్రిటన్ నుంచి విమాన రాకపోకలపై నిషేధాజ్ఞలు
బ్రిటన్‌లో బయటపడిన కొత్త రకం కరోనా వైరస్ స్ట్రైన్ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. పలు యూరోపియన్ దేశాలతోపాటు భారత్ కూడా బ్రిటన్ విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించగా, తాజాగా సౌదీ అరేబియా, కువైట్ దేశాలు కూడా ఈ జాబితాలో చేరాయి. అత్యవసర సేవలు తప్ప, మిగతా అన్ని విదేశీ విమానాలను వారం పాటు నిషేధిస్తున్నట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. దీంతోపాటు జల, భూమార్గాల ప్రవేశాలపైనా ఆంక్షలు విధించింది.
అయితే, పరిస్థితుల్లో మార్పు రాకుంటే కనుక మరో వారం పాటు పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. మరోవైపు కువైట్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించింది. కెనడా ప్రభుత్వం కూడా బ్రిటన్‌కు విమాన సర్వీసులు నిలిపివేసింది. ఇటీవల వెలుగు చూసిన ఈ కొత్త రకం వైరస్ నియంత్రించలేని విధంగా వ్యాప్తి చెందుతోందని ఇటీవల బ్రిటన్ చేసిన ప్రకటన ప్రపంచ దేశాలను మళ్లీ భయం గుప్పిట్లోకి నెట్టింది.