యూరప్ లో కెల్లా ఇటలీలోనే అత్యధిక కరోనా మరణాలు.. ఎందుకంటే..?
- ఇటలీలో స్వైరవిహారం చేసిన కరోనా
- ఇప్పటివరకు 68 వేల మరణాలు
- వారిలో అత్యధికులు వృద్ధులే
- కరోనా మహమ్మారిని తట్టుకోలేకపోతున్న ఇటలీ వృద్ధులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెల్లడి
కరోనా మహమ్మారి చైనా దాటి ప్రపంచ దేశాలపై పంజా విసిరాక అత్యధికంగా నష్టపోయిన దేశాల్లో ఇటలీ ఒకటి. ఈ యూరప్ దేశం కరోనా వ్యాప్తి తొలినాళ్లలో తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. కిక్కిరిసిన ఆసుపత్రులు, రోడ్లపైనే కరోనా రోగుల మరణాలతో కొన్నినెలల కిందట ఇటలీలో భీతావహ సన్నివేశాలు కనిపించాయి. రోజూ వేల సంఖ్యలో మరణాలు నమోదైన సందర్భాలు ఉన్నాయి. అమెరికా, బ్రెజిల్ తర్వాత అత్యధిక మరణాల రేటు ఇటలీలోనే నమోదైందని పలు నివేదికలు చెబుతున్నాయి.
ఇటలీలో అత్యధిక మరణాలకు బలమైన కారణమే ఉంది. ఇక్కడి ప్రజల్లో ఎక్కువమంది వృద్ధులే. ఇటలీలో వృద్ధుల జనాభా ఎక్కువ కావడంతో కరోనా మహమ్మారిని వారు తట్టుకోలేకపోయారు. సగటున నలుగురు ఇటలీ జాతీయుల్లో ఒకరు 65 ఏళ్ల పైబడినవారే. పైగా వారిలో అప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలు కరోనా దెబ్బకు మరింత పెరిగిపోయాయి. దాంతో ఇటలీ వృద్ధుల పాలిట కరోనా మరణ ఘంటికలు మోగించింది.
పైగా ఇటలీలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండడం వల్ల వ్యాప్తి ఎక్కువగా ఉందని, ఇళ్లలో ఉండే యువతీయువకుల ద్వారా వృద్ధులకు కరోనా పాకిందని గుర్తించారు. ఇప్పటికీ ఇటలీలో రోజుకు 600కి పైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. మొత్తం మరణాల సంఖ్య 68,000 దాటింది. ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వెల్లడించింది.