సీఎం జగన్ ఆస్తుల కేసు విచారణ వచ్చే నెల 4కి వాయిదా

  • సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ కేసుల విచారణ
  • పోటాపోటీగా వాదనలు
  • విజయసాయిపై ఏసీబీ చట్టం కింద అభియోగాలు వర్తిస్తాయన్న సీబీఐ
  • ఆ సమయంలో విజయసాయి ప్రజాప్రతినిధి కాదన్న న్యాయవాది
ఏపీ సీఎం జగన్ పై సుదీర్ఘకాలంగా విచారణ జరుగుతున్న ఆస్తుల కేసు జనవరి 4కి వాయిదా పడింది. జగన్ ఆస్తుల కేసులో హైదరాబాదులోని సీబీఐ, ఈడీ కోర్టు నేడు విచారణ చేపట్టింది. ఇరుపక్షాలు పోటాపోటీగా వాదనలు వినిపించాయి. జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీట్ లో విజయసాయిరెడ్డిపై ఏసీబీ చట్టం కింద అభియోగాలు వర్తిస్తాయని సీబీఐ పేర్కొనగా.... చార్జిషీటు దాఖలైన సమయంలో విజయసాయిరెడ్డి ఓ చార్టర్డ్ అకౌంటెంట్ మాత్రమేనని, ఆయన ఆ సమయంలో ప్రజాప్రతినిధి కాదని ఆయన తరఫున న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

అందుకు సీబీఐ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పందిస్తూ.... ఏసీబీ చట్టంలోని 9, 13 సెక్షన్ల కింద విజయసాయిరెడ్డిపై అభియోగాలు వర్తిస్తాయని తెలిపారు. తాను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కొన్నిరోజుల కిందటే బాధ్యతలు స్వీకరించినందున ఈ కేసుల్లో పూర్తిస్థాయిలో వాదనలు వినిపించేందుకు 10 రోజుల సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరారు. అనంతరం కోర్టు విచారణను వాయిదా వేసింది.


More Telugu News