సీఎంఎస్-01 ఉపగ్రహ సేవలు జవనరి మొదటివారం నుంచి అందుబాటులోకి వస్తాయి: ఇస్రో

  • ఇటీవల శ్రీహరికోట నుంచి రాకెట్ ప్రయోగం
  • రోదసిలోకి సీఎంఎస్-01 ఉపగ్రహం
  • ఉపగ్రహ తాజా పరిస్థితిపై ప్రకటన చేసిన ఇస్రో
  • కక్ష్య పెంపు విన్యాసాలు విజయవంతం అని వెల్లడి
ఈ నెల 17న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్ ద్వారా సీఎంఎస్-01 అనే కమ్యూనికేషన్స్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపిన సంగతి తెలిసిందే. ఈ ఉపగ్రహ పరిస్థితిపై ఇస్రో  ఓ ప్రకటన చేసింది. 2021 జనవరి మొదటివారం నుంచి సీఎంస్ఎస్-01 శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్ సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. అయితే, ముందుగా పేలోడ్ టెస్టింగ్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుందని ఇస్రో వివరించింది. ప్రస్తుతం ఈ ఉపగ్రహ కక్ష్య పెంపు ప్రక్రియ పూర్తయిందని, ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యను సమీపించిందని తెలిపింది. శాటిలైట్ రిఫ్లెక్టర్ ను కూడా విజయవంతంగా మోహరించడం జరిగిందని పేర్కొంది.


More Telugu News