కబ్జా చేసిన భూములు ఇచ్చేస్తే మంచిది... కొన్ని కేసుల్లో స్టేషన్ బెయిల్ కూడా రాదు: టీడీపీ నేతలకు విజయసాయి వార్నింగ్

  • విశాఖలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి
  • టీడీపీ హయాంలో భారీగా ఆక్రమణలు జరిగాయని ఆరోపణ
  • ఆక్రమించిన భూములు స్వచ్ఛందంగా ఇచ్చేయాలని సూచన
  • లేకపోతే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరిక
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఇవాళ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా విశాఖలో వివిధ కార్యక్రమాలతో బిజీగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో భారీగా భూ ఆక్రమణలు జరిగాయని ఆరోపించారు. ఆక్రమించిన భూములను టీడీపీ నేతలు స్వచ్ఛందంగా ఇచ్చేయాలని హితవు పలికారు. స్వచ్ఛందంగా ఇవ్వకుంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. కొన్ని కేసులకు స్టేషన్ బెయిల్ కూడా రాదని విజయసాయి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు ప్రజల సొమ్ము అని, వాటిని ఆక్రమించుకున్న వారిని వదలబోమని అన్నారు. పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే చర్యలు తప్పవని పేర్కొన్నారు.


More Telugu News