తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జగన్ జన్మదిన వేడుకలు!
- ఇసుక కేకును కట్ చేసిన టీడీపీ నేతలు
- జగన్ కు మంచి బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థనలు
- మూడు సార్లు ఇసుక విధానాన్ని మార్చారని మండిపాటు
అవును, మీరు చదువుతున్నది నిజమే. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ ఘటన నెల్లూరు టీడీపీ కార్యాలయంలో జరిగింది. కాకపోతే ముఖ్యమంత్రి తీరును నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఇసుకతో తయారు చేసిన కేకును టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, ఇతర టీడీపీ నేతలు కట్ చేశారు. ఈ సందర్భంగా జగన్ కు మంచి బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ, రెండు సంవత్సరాల్లో మూడు సార్లు ఇసుక విధానాన్ని మార్చారని విమర్శించారు. ప్రతిసారి ఇసుక ధరను పెంచుతున్నారని అన్నారు. ప్రస్తుతం ఒక యూనిట్ ఇసుక ధర రూ. 6,500 ఉందన్నారు. పెట్రోల్, డీజిల్ తో పోటీపడి రేటు పెరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం సరైన ఇసుక విధానాన్ని తీసుకురాకపోవడం వల్ల రాష్ట్రంలో కోటి మంది ఉపాధి కోల్పోయారన్నారు. జగన్ పుట్టినరోజును వైసీపీ శ్రేణులు ఎందుకు జరుపుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.