కరోనా కొత్త వైరస్ ప్రభావం.. మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ విధింపు!
- యూకేలో విస్తరిస్తున్న కరోనా కొత్త వైరస్
- ముంబైతో పాటు రాష్ట్రంలోని మేజర్ సిటీస్ లో రాత్రి కర్ఫ్యూ
- జనవరి 5 వరకు కర్ఫ్యూ అమలు
బ్రిటన్ ను వణికిస్తున్న కరోనా కొత్త వైరస్ ప్రభావం భారత్ పై పడింది. ముంబైతో పాటు రాష్ట్రంలోని అన్ని మేజర్ సిటీస్ లో రాత్రి కర్ఫ్యూని మహారాష్ట్ర ప్రభుత్వం విధించింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని తెలిపింది. జనవరి 5 వరకు ఈ కర్ఫ్యూని అమలు చేస్తున్నట్టు ప్రకటించింది.
మన దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 18,96,518 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్టాల కంటే ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. మరోవైపు కొత్త వైరస్ నేపథ్యంలో యూకే నుంచి రాకపోకలను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే.