కుమారస్వామికి షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పనున్న 12 మంది ఎమ్మెల్యేలు!
- కాంగ్రెస్, బీజేపీల్లో చేరనున్న అసంతృప్త నేతలు
- పార్టీ అధిష్ఠానం పట్టించుకోవడం లేదనే అసంతృప్తిలో ఎమ్మెల్యేలు
- సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఓ రెబెల్ ఎమ్మెల్యే
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి మరో షాక్ తగలబోతోంది. ఆయన పార్టీ జేడీఎస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు జంపింగ్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం. వీరంతా కాంగ్రెస్, బీజేపీల్లో చేరడానికి రంగం చేసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధిష్ఠానం తమను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు చెపుతున్నారు.
ఈ సందర్భంగా ఓ రెబెల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రస్తుతం తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లేదా బీజేపీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని... అసెంబ్లీ ఎన్నికలు సమీపించే నాటికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని తెలిపారు.
పార్టీలో దేవేగౌడ కుటుంబీకుల ఆధిపత్యం పెరిగి పోయిందని అసంతృప్త నేతలు అంటున్నారు. ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాల పట్ల పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని చెపుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తుపై నేతలు ఆందోళన చెందుతున్నారని... దేవేగౌడ కుమారులు పార్టీని సమర్థవంతంగా నడిపించలేరనే అభిప్రాయంలో ఉన్నారని చెప్పారు. మరోవైపు అసంతృప్తులను బుజ్జగించే పనిలో పార్టీ సీనియర్లు బిజీగా ఉన్నారు.