కాసేపట్లో ఖగోళ అద్భుతం... ఆకాశంలో ఒకటిగా కనిపించనున్న రెండు అతిపెద్ద గ్రహాలు
- పునరావృతం కానున్న ఖగోళ అద్భుతం
- అత్యంత సమీపానికి రానున్న గురు, శని గ్రహాలు
- భారత్ లో సాయంత్రం 5.21 నిమిషాల నుంచి 7.12 నిమిషాల వరకు కనిపిస్తుంది
- గతంలో 1623లో కనిపించిన అద్భుతం
అత్యంత అరుదుగా చోటుచేసుకునే ఖగోళ అద్భుతం ఇవాళ పునరావృతం అవుతోంది. ఎప్పుడో 1623లో ఒకదానికొకటి అత్యంత సమీపానికి వచ్చిన గురు, శని గ్రహాలు మళ్లీ ఇన్నాళ్లకు వినువీధిలో అరుదైన రీతిలో కనువిందు చేయనున్నాయి. ఈ అపురూమైన దృశ్యం ఈ సాయంత్రం 5.21 నిమిషాల నుంచి 7.12 నిమిషాల వరకు ఆవిష్కృతం కానుంది. అత్యంత సమీపానికి రానున్న ఈ రెండు అతిపెద్ద గ్రహాలు ఆకాశంలో ఒకటిగా కనిపించనున్నాయి. దీనినే శాస్త్రవేత్తలు 'మహా సంయోగం'గా అభివర్ణిస్తారు.
మన దేశంలో ఈ కమనీయ దృశ్యం దాదాపు 2 గంటల పాటు వీక్షించే అవకాశం ఉందని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు. భూమి నుంచి చూస్తే గురు, శని గ్రహాలు 0.1 డిగ్రీల ఎడంగా దర్శనమిస్తాయి. కాగా, ఈ రెండు గ్రహాలు మళ్లీ 2080 మార్చి 15న అత్యంత చేరువకు వస్తాయి.