కరోనా కొత్త వైరస్ పై అలర్ట్ గా ఉన్నాం: కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్

  • ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు
  • ఏదేదో ఊహించుకుని భయపడొద్దు
  • కారోనాను కేంద్ర ప్రభుత్వం ఎలా ఎదుర్కొందో అందరూ చూశారు
యూకేలో వేగంగా విస్తరిస్తోన్న కరోనా కొత్త వైరస్ విషయంలో భారత ప్రభుత్వం అలర్ట్ గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఏదేదో ఊహించుకుని భయభ్రాంతులకు గురి కావద్దని చెప్పారు. గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో, ప్రజలను సురక్షితంగా ఉంచడంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో అందరూ చూశారని చెప్పారు.

కొత్త వైరస్ గురించి తనను అడిగితే... ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెపుతానని అన్నారు. హర్షవర్థన్ ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటి తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడింది. యూకేపై ట్రావెల్ బ్యాన్ విధించింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు రాకపోకలను నిషేధిస్తున్నట్టు తెలిపింది.

అంతకు ముందు ఇదే విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. యూకేలో కరోనా కొత్త వైరస్ అత్యంత వేగంగా విస్తంరిస్తోందని... ఈ నేపథ్యంలో యూకే నుంచి వచ్చే అన్ని విమానాలను వెంటనే నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఆయన ట్వీట్ చేశారు.


More Telugu News