2023లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి విమానం ఎగురుతుంది: ఎన్ఐఏఎల్ సీఈవో
- భూములిచ్చినోళ్లందరికీ ఆరు నెలల్లో పరిహారం, పునరావాసం
- కేంద్ర ప్రభుత్వానికి సుమారు రూ.350 కోట్ల ఖర్చు
- అనుకున్న షెడ్యూల్ ప్రకారమే పనులు జరుగుతున్నాయి
నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 2023 డిసెంబర్ లేదా 2024 జనవరిలో మొదటి విమానం ఎగిరే అవకాశం ఉందని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (ఎన్ఐఏఎల్) సీఈవో అరుణ్ వీర్ సింగ్ చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం 3,076 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందని, ఆ పనులను మొదలుపెట్టామని, వచ్చే ఏడాది మీ నాటికి ఇవి పూరతవుతాయని వివరించారు.
మొదటి రన్ వే కోసం ఇప్పటికే కొందరి దగ్గర భూములు తీసుకున్నామని, ముందుగా వాళ్లకు సెటిల్ మెంట్ చేస్తామని చెప్పారు. తర్వాత రెండో రన్ వే కోసం భూములిచ్చిన వాళ్లకు సెటిల్ చేస్తామన్నారు. భూములిచ్చిన వాళ్లందరికీ ఆరు నెలల్లో పరిహారం చెల్లిస్తామని, జేవార్ బంగర్ లో పునరావాసం కల్పిస్తామని అరుణ్ చెప్పారు. మొత్తంగా ఆరు గ్రామాల్లోని జనానికి పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వానికి దాదాపు రూ.350 కోట్లు ఖర్చవుతుందన్నారు.
అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ పనులు నడుస్తున్నాయని, 2023 డిసెంబర్ లేదా, 2024 జనవరిలో అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లైట్ జర్నీ చేసే అవకాశాలున్నాయని వివరించారు.
కాగా, గౌతమ్ బుద్ధనగర్ జిల్లాలోని జేవార్ దగ్గర కడుతున్న విమానాశ్రయం పేరు, డిజైన్, లోగోలను ఈనెల 18న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆమోదించారు. స్విట్జర్లాండ్ కు చెందిన జూరిక్ ఎయిర్ పోర్ట్ ఇంటర్నేషనల్ ఏజీ (జెడ్ఏఐఏ) అనే సంస్థ నిర్మాణ పనుల కాంట్రాక్ట్ ను దక్కించుకుంది. 40 ఏళ్ల పాటు ఆ కంపెనీనే విమానాశ్రయ నిర్వహణను చూడనుంది. మొదటి దశలో భాగంగా ఏటా కోటీ 20 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యం, రెండు రన్ వేలతో ఈ విమానాశ్రయాన్ని కడుతున్నారు.