బీజేపీలో జేడీఎస్ విలీనమవుతుందని ప్రచారం.. కుమారస్వామి స్పందన
- ఏ పార్టీల్లోనూ విలీనం కాము
- బీజేపీ రాజకీయ కార్యకలాపాలనేవి ఆ పార్టీకి చెందిన అంతర్గత వ్యవహారం
- వారు తీసుకున్న నిర్ణయంపై నేను జోక్యం చేసుకోను
- కర్ణాటకలో జేడీఎస్‌కి స్పష్టమైన మెజార్టీ తీసుకొచ్చేందుకు కృషి
కర్ణాటకలోని జేడీఎస్ పార్టీ.. బీజేపీలో విలీనం అవుతుందంటూ వస్తున్న ప్రచారంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమార స్వామి స్పందించారు. తమ పార్టీ ఏ జాతీయ లేక ప్రాంతీయ పార్టీల్లోనూ విలీనం కాబోదని తెలిపారు. బీజేపీ రాజకీయ కార్యకలాపాలనేవి ఆ పార్టీకి చెందిన అంతర్గత వ్యవహారమని చెప్పారు.
బీజేపీ తీసుకున్న నిర్ణయంలో తాను జోక్యం చేసుకోవాలని అనుకోవట్లేదని తెలిపారు. బీజేపీలో విలీనం కావాలని, పొత్తు పెట్టుకోవాలని తాను భావించట్లేదని చెప్పారు. కర్ణాటకలో మరో రెండున్నరేళ్లు కష్టపడి పనిచేసి జేడీఎస్ కి రాష్ట్రంలో స్పష్టమైన మెజార్టీ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని కుమారస్వామి తెలిపారు.