ఫైట్ సీన్ షూట్ చేస్తుంటే, కుప్పకూలిన మిథున్ చక్రవర్తి!
- 'ది కశ్మీర్ ఫైల్స్'లో నటిస్తున్న మిథున్
- ఫుడ్ పాయిజనింగ్ కారణంగా విపరీతమైన కడుపునొప్పి
- కాసేపు విశ్రాంతి తరువాత తిరిగి షూటింగ్
బాలీవుడ్ సీనియర్ స్టార్ మిధున్ చక్రవర్తి, ఓ ఫైట్ సీన్ తీస్తుండగా, అనారోగ్యానికి గురై కుప్పకూలారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది కశ్మీర్ ఫైల్స్'లో మిథున్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇక ఆయన అస్వస్థతకు గురవ్వడంపై దర్శకుడు ఓ ప్రకటన విడుదల చేస్తూ, "మిథున్ చక్రవర్తిపై ఓ భారీ యాక్షన్ సీన్ ను షూట్ చేస్తుండగా, ఆయన విపరీతమైన కడుపు నొప్పితో అనారోగ్యానికి గురై పడిపోయారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే ఇది జరిగింది" అని తెలిపారు.
ఆ పొజిషన్ లో మరొకరు ఉండివుంటే కనీసం నిలబడి కూడా ఉండేవారు కాదని, కానీ, సూపర్ స్టార్ మిథున్ మాత్రం కొంతసేపు విశ్రాంతి తరువాత తిరిగి షూటింగ్ లో పాల్గొన్నారని వివేక్ వెల్లడించారు. ఆపై తన వల్ల షూటింగ్ ఆగిపోయిందా? అని ప్రశ్నించారని, ఈ తరం నటుల్లో మిథున్ చూపినంత అంకితభావాన్ని తాను మరెవరిలోనూ చూడలేదని అన్నారు.
తన 40 సంవత్సరాల సినీ కెరీర్ లో తనకు ఎన్నడూ ఇలా అనారోగ్యం కలగలేదని ఆయన అన్నారని, మిథున్ ఏ మూవీ యూనిట్ కైనా ఆస్తి వంటివారని ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, జమ్ము కశ్మీర్ లో హిందువుల గురించి చర్చిస్తూ, వారి దుస్థితిని ప్రపంచానికి తెలిపేందుకు ఈ సినిమాను తీస్తున్నానని వివేక్ తెలిపారు. మిథున్ తో పాటు అనుపమ్ ఖేర్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం వెండితెరపైకి రానుంది.