తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అరెస్టు
- నూతన వ్యవసాయ చట్టాలపై వరంగల్‌లో ధర్నా
- పాల్గొనేందుకు వెళ్లిన వీహెచ్
- పెంబర్తి వద్ద అరెస్టు చేసిన పోలీసులు
- పోలీసులపై వీహెచ్ ఆగ్రహం
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావును పోలీసులు ఈ ఉదయం అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ లో రైతులు నిర్వహిస్తోన్న ధర్నాలో పాల్గొనడానికి వీహెచ్ వెళ్లారు.
అయితే, ఆయనను పెంబర్తి వద్ద ఈ రోజు ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఆయనను వ్యానులో లింగాల ఘనపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, ఆయనను పెంబర్తి వద్ద ఈ రోజు ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఆయనను వ్యానులో లింగాల ఘనపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.