రాజేంద్రప్రసాద్, జయప్రద కలసి జంటగా నటించే ప్రేమకథా చిత్రం!

  • గతంలో పలు చిత్రాల్లో కనిపించిన రాజేంద్ర ప్రసాద్, జయప్రద
  • తొలిసారిగా జంటగా కనిపించనున్న ఇద్దరూ
  • 60 ఏళ్ల వయసులో పుట్టే ప్రేమ కథాంశంగా చిత్రం
సహజ నటుడు రాజేంద్ర ప్రసాద్, అలనాటి అందాల హీరోయిన్ జయప్రద కలిసి ఓ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. గతంలో ఎన్నో చిత్రాల్లో కలిసి నటించిన వీరు, ఒక్క సినిమాలోనూ జంటగా కనిపించలేదు. ఇప్పుడు ఆ చాన్స్ వచ్చింది. ఓటీటీ కోసం నిర్మిస్తున్న 'లవ్ ఎట్ 60' అనే సినిమాలో వీరిద్దరూ 60 ఏళ్ల వయసులో ప్రేమలో పడిన జంటగా కనిపించనున్నారు.

దీనిపై ఇప్పటివరకూ ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఈ చిత్రం ఓటీటీ స్థాయిని పెంచేదిగా ఉంటుందని, త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. కాగా, గతంలో 'తాండవ కృష్ణుడు', 'సంపూర్ణ ప్రేమాయణం', 'సంసారం' తదితర ఎన్నో చిత్రాల్లో రాజేంద్ర ప్రసాద్, జయప్రద కలసి నటించారు. అయితే, ఆ సినిమాల్లో జంటగా మాత్రం చేయలేదు.


More Telugu News