బిగ్ బాస్ ఇచ్చిన రూ.25 లక్షల క్యాష్ ఆఫర్ కు ఓకే చెప్పిన సొహైల్

  • బిగ్ బాస్ ఇంటి నుంచి మరో కంటెస్టెంట్ అవుట్
  • రూ.20 లక్షలు ఆఫర్ చేసిన బిగ్ బాస్
  • ఆపై మరో రూ.5 లక్షలు పెంపు
  • డబ్బు తీసుకుని బయటికి వచ్చిన సొహైల్
  • టైటిల్ రేసులో అభిజీత్, అఖిల్
బిగ్ బాస్-4 రియాల్టీ షో గ్రాండ్ ఫినాలేలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు ఎలిమినేట్ కాగా మిగిలిన ముగ్గురిలో ఒకడైన రియాన్ సొహైల్ బిగ్ బాస్ ఇచ్చిన క్యాష్ ఆఫర్ ను అంగీకరించాడు. మొదట రూ.20 లక్షలు ఇస్తానన్న బిగ్ బాస్ ఆ తర్వాత మరో 5 లక్షలు పెంచడంతో సొహైల్ ఆ డబ్బు తీసుకుని హౌస్ నుంచి బయటికి రావాలని నిర్ణయించుకున్నాడు.

దాంతో హోస్ట్ నాగార్జున మరో అవకాశం ఇచ్చినా సొహైల్ క్యాష్ ఆఫర్ కే మొగ్గు చూపడంతో ఆ పాతిక లక్షల రూపాయలు అతడికే లభించాయి. దాంతో టైటిల్ ఇక అభిజీత్, అఖిల్ లో ఒకరికి దక్కనుంది. సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రకారం అభిజీత్ కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇప్పటివరకు జరిగిన అన్ని బిగ్ బాస్ సీజన్లలో ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా క్యాష్ ఆఫర్ స్వీకరించలేదు. ఆ ట్రెండ్ ను సొహైల్ మార్చేశాడు.

కాగా, పాతికలక్షల క్యాష్ బ్యాగ్ తో స్టేజిపైకి వచ్చిన సొహైల్... అందులో రూ.5 లక్షలు తన ఫ్రెండ్ మెహబూబ్ కు ఇస్తానని ప్రకటించగా, మెహబూబ్ సున్నితంగా తిరస్కరించి, ఆ డబ్బును అనాథల కోసం ఇస్తానని చెప్పాడు. ఇలా ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణను గమనించిన నాగ్... ఆ పాతిక లక్షలు కాక, నేనే మీకు రూ.10 లక్షలు ఇస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.


More Telugu News