బిగ్ బాస్ ఇంటి నుంచి దేత్తడి హారిక ఎలిమినేషన్
- కొనసాగుతున్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే
- బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించిన అనిల్ రావిపూడి, మెహ్రీన్
- హారికను ఎలిమినేట్ చేసిన వైనం
- మిగిలిన నలుగురు కంటెస్టెంట్ల మధ్య పోటీ
బిగ్ బాస్ రియాల్టీ షో నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలే రంజుగా సాగుతోంది. హౌస్ లో ఉన్న ఐదుగురు ఫైనలిస్టుల నుంచి ఒకర్ని ఎలిమినేట్ చేసి తీసుకొచ్చేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ మెహ్రీన్ బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించారు. అనిల్ రావిపూడి తనదైన శైలిలో వినోదం పండిస్తూ చివరికి దేత్తడి హారిక ఎలిమినేట్ అయినట్టుగా తేల్చారు. ప్రస్తుతం హౌస్ లో అఖిల్, అరియానా, అభిజిత్, సొహైల్ మిగిలున్నారు. కాగా, తాను ఎలిమినేట్ అవడం పట్ల హారిక స్పందిస్తూ, ఇప్పటివరకు ఎంతో ఆస్వాదించానని తెలిపింది. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో నేర్చుకున్నానని వివరించింది.