కరోనా కొత్త వెర్షన్ వస్తోంది... బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించిన యూరప్ దేశాలు

  • బ్రిటన్, దక్షిణాఫ్రికాలో కరోనా కొత్తరకం వైరస్
  • వేగంగా వ్యాపిస్తున్న నూతన వైరస్
  • పరిస్థితి చేయిదాటిపోయిందన్న బ్రిటన్
  • అప్రమత్తమైన యూరప్ దేశాలు
  • బ్రిటన్ విమానాలపై నిషేధం బాటలో జర్మనీ
మానవాళికి ముప్పుగా పరిణమించిన కరోనా మహమ్మారి వైరస్ రూపు మార్చుకుంటోంది. బ్రిటన్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ప్రస్తుతం వ్యాప్తిస్తున్న కరోనా వైరస్ కొత్తదని వెల్లడైంది. ఈ తరహా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో పలు యూరప్ దేశాలు అప్రమత్తయ్యాయి. బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధిస్తున్నట్టు బెల్జియం, నెదర్లాండ్స్ ప్రకటించాయి. జర్మనీ కూడా అదే బాటలో నడవాలని నిశ్చయించుకుంది. క్రిస్మస్ పండుగ రానున్న నేపథ్యంలో కరోనా కట్టడి కోసం యూరప్ దేశాలు కఠినచర్యలకు ఉపక్రమించాయి.

కరోనా కొత్తరకం వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో లండన్ లో లాక్ డౌన్ విధించారు. ఈ నూతన రకం వైరస్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. దీనిపై బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి మాట్ హేంకాక్ మాట్లాడుతూ, కరోనా కొత్తరకం వైరస్ తమ చేయి దాటిపోయిందని నిస్సహాయత వ్యక్తం చేశారు.


More Telugu News