హైదరాబాద్‌లో మరో చిట్‌ఫండ్ సంస్థ మోసం.. రాత్రికి రాత్రే డైరెక్టర్ల పరారీ
- బోర్డు తిప్పేసిన కూకట్‌పల్లిలో కేకేఆర్ చిట్స్‌ఫండ్స్
- 300 మంది ఖాతాదారులకు టోపీ
- రూ.10 కోట్లు వసూలు చేసి పరారీ
హైదరాబాద్ లో మరో చిట్‌ఫండ్ సంస్థ మోసానికి పాల్పడింది. కూకట్‌పల్లిలో కేకేఆర్ చిట్స్‌ఫండ్స్ సంస్థ బోర్డు తిప్పేసి, 300 మంది ఖాతాదారులకు టోపీ పెట్టింది. వారి నుంచి రూ.10 కోట్లు వసూలు చేసి సంస్థను మూసేసింది. దాని డైరెక్టర్లు కిరణ్ కుమార్, షణ్ముఖి, వెంకట రమణారావు రాత్రికి రాత్రే పారిపోయారు.
వారికి ఫోన్లు చేసినప్పటికీ కలవడం లేదు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డైరెక్టర్లు ముగ్గురి కోసం గాలిస్తున్నారు. కష్టపడి సంపాదించిన తమ డబ్బంతా చిట్‌ఫండ్ సంస్థలో పెట్టి మోసపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.