అరువు తీసుకున్న వజ్రాలను వ్యక్తిగత అవసరాలకు విక్రయించాడంటూ నీరవ్ మోదీ సోదరుడిపై అమెరికాలో కేసు
- చిక్కుల్లో పడిన నీరవ్ మోదీ సోదరుడు నిహాల్
- న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదు
- పీఎన్బీ స్కాంలోనూ నిహాల్ నిందితుడే
- అప్పట్లో నిహాల్ పై అభియోగాలు మోపిన సీబీఐ
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నిహాల్ మోదీ చిక్కుల్లో పడ్డారు. అరువు తీసుకున్న వజ్రాలను వ్యక్తిగత అవసరాల కోసం విక్రయించాడంటూ నిహాల్ పై అమెరికాలోని న్యూయార్క్ లో కేసు నమోదైంది. ఆంట్వెర్ప్ లో నివాసం ఉంటున్న నిహాల్... మరో సంస్థకు విక్రయిస్తానని చెప్పి ఎల్ఎల్ డీ డైమండ్స్ సంస్థ నుంచి వజ్రాలు తీసుకుని మోసం చేశాడంటూ అతడిపై అభియోగాలు మోపారు.
కాగా, నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నిహాల్ పైనా సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది. పీఎన్బీ స్కాంలో నిహాల్ 27వ నిందితుడు. ఈ స్కాంకు సంబంధించి దుబాయ్ లో ఆధారాలను నాశనం చేశాడని సీబీఐ అప్పట్లో అభియోగాలు నమోదు చేసింది.