వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు: ఎంపీ అరవింద్

  • హన్మకొండలో అరవింద్ మీడియా సమావేశం
  • ఏడు దశాబ్దాల తర్వాత కూడా రైతు పరిస్థితి దయనీయమేనన్న అరవింద్
  • రైతు అభివృద్ధి కోసమే నూతన చట్టాలు తెచ్చామని వెల్లడి
  • ఢిల్లీ నిరసనల్లో రైతులు లేరని వ్యాఖ్యలు
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ దేశరాజధానిలో జరుగుతున్న నిరసనలపై స్పందించారు. హన్మకొండ హరిత కాకతీయ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అరవింద్ మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత కూడా రైతు పరిస్థితి అధ్వానంగానే ఉందని అన్నారు. రైతు అభ్యున్నతి కోసమే కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని, ఆ చట్టాలను వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు.

మొన్న జరిగింది భారత్ బంద్ కాదని పోలీస్ బంద్ అని, ఆ బంద్ లో రైతులు కనిపించలేదని పేర్కొన్నారు. అసలు, ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్లో రైతులెక్కడున్నారని ప్రశ్నించారు. ఇక, సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తూ, ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్ కు రైతు బంధు గుర్తుకొస్తుందని, చర్చలకు పిలిస్తే రారు కానీ, చట్టాలు మాత్రం వద్దంటారని అసహనం ప్రదర్శించారు.


More Telugu News