ఉచితాల పేరుతో ఈ దగా జరుగుతూనే ఉంటుంది: కేటీఆర్ ప్రకటనపై ఐవైఆర్ విమర్శలు
- హైదరాబాద్‌లో వచ్చేనెల నుంచి ఉచిత తాగునీటి సరఫరా
- నిన్న ప్రకటన చేసిన కేటీఆర్
- రాజకీయ నాయకుడిని అర్థం చేసుకునే ప్రజలు లేనంతవరకు ఇలాగే చేస్తారన్న ఐవైఆర్
హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని జనవరి నుంచి ప్రారంభించనున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. 20 వేల లీటర్ల వరకు తాగునీటిని ఉచితంగా అందిస్తామని, అలాగే, డిసెంబరు నెల బిల్లును చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన అన్న విషయాన్ని పేర్కొన్న వార్తలను ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పోస్ట్ చేస్తూ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.
‘మీ నుంచి భారం కాని నీటి తీరువా వసూలు చేస్తాం. బాటిల్ నీళ్లతో అవసరం లేని మంచినీరు సరఫరా చేస్తాం. వసూలు చేసిన ప్రతి రూపాయి ఏ విధంగా ఖర్చు పెట్టింది తెలియజేస్తాం.. అని చెప్పే రాజకీయ నాయకుడిని అర్థం చేసుకునే ప్రజలు లేనంతవరకు, ఉచితాల పేరుతో ఈ దగా జరుగుతూనే ఉంటుంది’ అని ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు.