ఉజ్జయిని మహాకాళ్ పక్కనే వెలుగులోకి వచ్చిన పురాతన ఆలయం!
- మహాకాళ్ ఆలయం విస్తరణలో భాగంగా తవ్వకాలు
- వెలుగులోకి వచ్చిన కళాకృతులు, ఆలయం నమూనా
- పూర్తిగా తవ్విన తరువాత వివరాలు వెల్లడిస్తామన్న పురాతత్వ శాఖ
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళ్ అలయం పక్కనే దాదాపు వెయ్యి సంవత్సరాల నాటి పురాతన ఆలయం వెలుగులోకి వచ్చింది. ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరుగుతున్న వేళ, ఈ అద్భుతం జరిగింది. పురాతన కళాకృతులు, ఆలయం నమూనాలు బయటపడటంతో విషయం తెలుసుకున్న పురాతత్వ విభాగం అధికారులు ఆలయం వద్దకు చేరుకుని, దాన్ని పరిశీలిస్తున్నారు.
ఈ ప్రాంతంలో పురాతన ఆలయం వెలుగులోకి రావడం ఇదే తొలిసారని స్థానికులు అంటున్నారు. పూర్తిగా తవ్వకాలు జరిపి, ఆలయాన్ని వెలుగులోకి తెస్తే, దాని నిర్మాణంపై మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.