పరువు నష్టం కేసులో అజిత్ దోవల్ కుమారుడికి క్షమాపణలు చెప్పిన జైరాం రమేశ్
- మ్యాగజైన్‌లో వచ్చిన కథనాల ఆధారంగానే ఆ ఆరోపణలు
- నిజానిజాలు నిర్ధారించుకోకుండా క్షణికావేశంలో చేశానన్న జైరాం
- కేసును వెనక్కి తీసుకున్న వివేక్ దోవల్
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కుమారుడు వివేక్, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేసిన కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ క్షమాపణలు తెలిపారు. 2019 ఎన్నికల సమయంలో ఓ మ్యాగజైన్‌లో ప్రచురితమైన కథనం ఆధారంగా నిజానిజాలు నిర్ధారించుకోకుండా, క్షణికావేశంలో ఆ ఆరోపణలు చేశానని కోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ వెబ్‌సైట్‌లో ఉన్న కథనాలను కూడా తొలగించాలని పార్టీకి తెలిపినట్టు పేర్కొన్నారు. జైరాం క్షమాపణలతో స్పందించిన వివేక్ దోవల్ ఆయనపై పెట్టిన పరువునష్టం కేసును ఉపసంహరించుకున్నారు.