యూఎస్ స్టాక్ ఎక్స్చేంజ్‍ల నుంచి చైనా కంపెనీల డీలిస్ట్.. సంతకం చేసిన ట్రంప్

  • ‘హోల్డింగ్ ఫారిన్ కంపెనీస్ అకౌంటబుల్ యాక్ట్’ పేరుతో అమెరికా కొత్త చట్టం
  • ఈ చట్టంతో విదేశీ కంపెనీల నియంత్రణ
  • అలీబాబా, బైడు వంటి ప్రముఖ కంపెనీలపై తీవ్ర ప్రభావం!
చైనాకు షాకిస్తూ అమెరికా మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయిలో ఉండగా, ఇప్పుడు చైనా కంపెనీలకు వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకుంది. అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్‍ల నుంచి చైనా కంపెనీలను డీలిస్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన చట్టంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ‘హోల్డింగ్ ఫారిన్ కంపెనీస్ అకౌంటబుల్ యాక్ట్’ పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టం విదేశీ కంపెనీలను నియంత్రిస్తుంది.

అమెరికన్ సెక్యూరిటీస్ చట్టాలను పాటించడంలో చైనా కంపెనీలు విఫలమైతే ఈ చట్టం ప్రకారం వాటిని స్టాక్ మార్కెట్ల నుంచి తొలగించే అధికారం ఉంటుంది. అలాగే, స్టాక్ ఎక్స్చేంజ్‍‌లలో లిస్ట్ అయిన కంపెనీలు తమపై తమ దేశ నియంత్రణ ఏమీ లేదని నిర్ధరిస్తూ ధ్రువీకరణ పత్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. విదేశీ కంపెనీలన్నింటికీ ఈ చట్టం వర్తిస్తుంది. అమెరికా తీసుకొచ్చిన తాజా చట్టం ప్రభావం చైనా దిగ్గజ కంపెనీలైన అలీబాబా గ్రూప్, బైడు వంటి వాటిపై పడే అవకాశం ఉంది.


More Telugu News