ఆడవాళ్లకు గడ్డం వచ్చినా, గొంతు మారినా మాకు సంబంధం లేదు: వ్యాక్సిన్ పై బ్రెజిల్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్య!

  • ఫైజర్ వ్యాక్సిన్ కు అనుమతినిచ్చిన బ్రెజిల్
  • కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్టు వార్తలు
  • ఏ ప్రభావం కనిపించినా సంబంధం లేదన్న బోల్సొనారో
ఇటీవల తమ దేశ ప్రజలకు ఫైజర్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను ఇవ్వడానికి అనుమతిచ్చిన బ్రెజిల్, కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని వస్తున్న వార్తలపై స్పందించింది. దీనిపై తాజాగా జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన అధ్యక్షుడు జైర్ బోల్సొనారో, సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ కంపెనీకి సంబంధం లేదని, ఈ విషయమై తాము చేసుకున్న ఒప్పందంలో విషయం స్పష్టంగా ఉందని చెప్పారు.

వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ముసలిగా మారినా, మహిళకు గడ్డం పెరిగినా, అబ్బాయి గొంతు అమ్మాయిలా మారినా ఫైజర్ కు సంబంధం ఉండదని, అది వ్యాక్సిన్ తీసుకున్న వారి సమస్యేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైజర్ కు ఎటువంటి సంబంధం ఉండబోదని ఆయన తేల్చి చెప్పారు. ఫైజర్ వ్యాక్సిన్ ను బ్రెజిల్ తో పాటు చాలా దేశాలు అత్యవసర వినియోగానికి అనుమతించిన సంగతి తెలిసిందే.



More Telugu News