కేసీఆర్ ఫాంహౌస్ లో ఏదో ఉంది.. తనిఖీలు చేయాలి: బండి సంజయ్
- ఫాంహౌస్ లో కేసీఆర్ ఏదో దాచారు
- సోదాలు నిర్వహిస్తే ఏదో ఒకటి బయట పడుతుంది
- రైతులను కేసీఆర్ పట్టించుకోవడం లేదు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ దాటి బయటకు రావడం లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ ఫాంహౌస్ లో ఏదో ఉందని... తనిఖీలు చేయాల్సిందేనని అన్నారు. సోదాలు నిర్వహిస్తే ఏదో ఒకటి బయటపడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాంహౌస్ లో కేసీఆర్ కచ్చితంగా ఏదో దాచారని... అందుకే ఎప్పుడూ అక్కడకు వెళ్తుంటారని అన్నారు. బండి సంజయ్ ను ఈరోజు ఆదిలాబాద్ జిల్లా రైతులు కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రజల ఆలోచన ఒకటేనని... టీఆర్ఎస్ ను గద్దె దించి, బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనేదే అందరి లక్ష్యమని సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి ఎవరి కోసం పని చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను సీఎం పట్టించుకోవడం మానేశారని చెప్పారు.
మైలార్ దేవ్ పల్లి బీజేపీ కార్పొరేటర్ పై దాడి చేశారని... తాము తిరిగి దాడి చేయడం పెద్ద విషయమేమీ కాదని సంజయ్ హెచ్చరించారు. తాము తలచుకుంటే టీఆర్ఎస్ నేతలు తిరగలేరని అన్నారు. ప్రగతి భవన్ కు వచ్చిన రైతులపై పోలీసులు దాడి చేశారని... ఫిట్స్ వచ్చినా నాలుగు గంటల పాటు పోలీస్ స్టేషన్ లోనే ఉంచారని దుయ్యబట్టారు.