జనవరి మొదటివారంలో హైదరాబాదులో ఉచిత తాగునీటి సరఫరా పథకం ప్రారంభం: కేటీఆర్ వెల్లడి

  • నగరంలో 20 వేల లీటర్ల వరకు తాగునీరు ఫ్రీ
  • సీఎం కేసీఆర్ హామీ అమలు చేస్తున్నామన్న కేటీఆర్
  • జలమండలి అధికారులతో సమీక్ష
  • డిసెంబరు నెల బిల్లుపై ప్రత్యేక ఆదేశాలు
  •  20 వేల లీటర్ల వరకు రుసుము వద్దని స్పష్టీకరణ
హైదరాబాదులో ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని జనవరి మొదటి వారంలో ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జలమండలి అధికారులతో కేటీఆర్ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు డిసెంబరు నెల నుంచి 20 వేల లీటర్ల వరకు ఎలాంటి రుసుము వసూలు చేయబోమని తెలిపారు. హైదరాబాద్ నగర ప్రజలందరికీ ఈ పథకంతో ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ఈ పథకం అమలుకు రాబోయే రెండు వారాల్లో ఏర్పాట్లు చేసుకోవాలని కేటీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.


More Telugu News