కాంగ్రెస్ కు షాక్.. రాజీనామా చేసిన రాహుల్ టీమ్ సభ్యురాలు రుచిగుప్త
- విద్యార్థి విభాగం ఇన్చార్జి రుచి గుప్త రాజీనామా
- కేసీ వేణుగోపాల్ పై విమర్శలు గుప్పించిన వైనం
- పార్టీలో సంస్థాగత మార్పులు తీసుకురావడంలో జాప్యంపై ఆగ్రహం
గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ఎంతో పేరు, ప్రఖ్యాతులు కలిగిన కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన ఈ పార్టీ బలహీనంగా తయారవుతోంది. పార్టీని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాల్సిందేనంటూ హైకమాండ్ కు పార్టీకి చెందిన 23 మంది సీనియర్లు కొన్ని రోజుల క్రితం లేఖ రాశారంటే... పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అనేక రాష్ట్రాల్లో సొంతంగా పోటీ చేసి గెలుపొందే పరిస్థితి కూడా లేదు. తాజాగా ఆ పార్టీకి మరో షాక్ తగిలింది.
రాహుల్ గాంధీ టీమ్ లో సభ్యురాలు, కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఇన్చార్జి రుచి గుప్త ఈరోజు పార్టీకి రాజీనామా చేశారు. అసంతృప్త నేతలు ఈరోజే సోనియాగాంధీతో సమావేశమయ్యారు. ఈ తరుణంలో ఆమె రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూనే తాను రాజీనామా చేశానని ప్రకటించారు. ఇదే సమయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాహుల్ కు సన్నిహితుడు అయిన కేసీ వేణుగోపాల్ పై ఆమె మండిపడ్డారు. సంస్థాగత మార్పులు తీసుకురావడంలో జరుగుతున్న జాప్యానికి వేణుగోపాలే కారణమని ఆరోపించారు.