పర్యావరణ విధ్వంసం జరుగుతోంది... ఏపీ సీఎం జగన్ కు టీడీపీ నేత యనమల లేఖ
- తొండంగి మండలంలో ఉద్రిక్తతలపై లేఖ
- మత్స్యకారులు, మహిళలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపణ
- పరిశ్రమతో పర్యావరణ ముప్పు ఉందని వెల్లడి
- జగన్ హామీలను గాలికొదిలేశారని వ్యాఖ్యలు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సీఎం జగన్ కు లేఖ రాశారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ పరిశ్రమ ఎదుట రైతుల ఆందోళనలను ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తొండంగి మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.
మత్స్యకారులు, మహిళలు, రైతులపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. కోనసీమ ప్రాంతంలో రసాయన పరిశ్రమ కారణంగా పర్యావరణ ముప్పు ఏర్పడిందని వివరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని యనమల తన లేఖలో విమర్శించారు. అధికారంలోకి వచ్చాక పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు.