టెస్టుల్లో భారత చరిత్రలోనే ఇది అత్యల్ప స్కోరు
- భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు
- రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 36 పరుగులు
- 1974, జూన్ 20న ఇంగ్లండ్‌పై టీమిండియా 42 పరుగులు
- 1947, నవంబరు 28న ఆస్ట్రేలియాపై 58 రన్స్
- చెత్త రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి కొత్త చెత్త రికార్డు
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 36 పరుగులు మాత్రమే చేసి, ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. టీమిండియా చరిత్రలోనే ఇది అత్యల్ప స్కోరుగా నిలిచింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా భారత బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. 1974, జూన్ 20న ఇంగ్లండ్ లోని లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచులో రెండో ఇన్సింగ్స్ లో టీమిండియా 42 పరుగులు చేసింది.
1947, నవంబరు 28న ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ లో జరిగిన తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 58 పరుగులు మాత్రమే సాధించింది.
1952లో జులై 17న ఇంగ్లండ్ తో మాంచెస్టర్ లో జరిగిన తొలి ఇన్నింగ్స్ లో భారత్ 58 పరుగులు చేసింది.
1996, డిసెంబరు 26న దక్షిణాఫ్రికాతో డర్బన్ వేదికగా జరిగిన రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 66 పరుగులు చేసింది.
1948, ఫిబ్రవరి 6న ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ లో జరిగిన టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 67 పరుగులు మాత్రమే చేసింది.
ఈ రోజు ఈ చెత్త రికార్డులన్నింటినీ టీమిండియా బ్యాట్స్ మెన్ చెరిపేసి మరో కొత్త చెత్త రికార్డును సృష్టించారు.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యల్ప టెస్టు స్కోరుల రికార్డులను పరిశీలిస్తే 1955లో ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ అత్యల్ప స్కోరు( 26) చేసింది. 1896లో ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా 30 పరుగులు చేసింది. 1924లో ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా మళ్లీ 30 పరుగులు మాత్రమే చేయగలిగింది.
1899లో ఇంగ్లాండ్ పై దక్షిణాఫ్రికా 35 పరుగులకే వెనుదిరిగింది. 1902లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా 36 పరుగులు చేసింది. 1932లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 36 పరుగులు మాత్రమే సాధించింది. 2019లో ఇంగ్లండ్ పై ఐర్లాండ్ 42 పరుగులు మాత్రమే చేయగలిగింది.