36 పరుగులకే టీమిండియా ఆలౌట్!
- తొలి ఇన్నింగ్స్ లో భారత్ 244 పరుగులు
- ఆసీస్ 191 పరుగులు
- రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్
- మొత్తం 90 పరుగులు చేస్తే గెలుపు
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. కేవలం 36 పరుగులు మాత్రమే చేసి, ఆలౌట్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 244, ఆస్ట్రేలియా 191 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా గెలవాలంటే రెండో ఇన్సింగ్స్‌లో 90 పరుగులు మాత్రమే చేస్తే సరిపోతుంది.
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్ మెన్ ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోరు వరకూ కూడా చేరుకోలేకపోయారు. టీమిండియా బ్యాట్స్ మెన్‌లో పృథ్వీ షా 4, మయాంక్ 9, బుమ్రా 2, పుజారా 0, విరాట్ కోహ్లీ 4, రహానే 0, వృద్ధిమాన్ సాహా 4, రవి చంద్రన్ అశ్విన్ 0, హనుమ విహారి 8, ఉమేశ్ యాదవ్ 4 (నాటౌట్), షమీ 1 పరుగు (రిటైర్డ్ హర్ట్) మాత్రమే చేశారు.
ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ ఐదు వికెట్లు తీయగా, కమిన్స్ నాలుగు వికెట్లు తీశాడు. రెండో ఇన్సింగ్స్ ను ఆస్ట్రేలియా ప్రారంభించింది. మాథ్యూ వాడే 14, జో బర్న్స్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.