పదేళ్లకే బిడ్డకు జన్మనిచ్చిన కొలంబియా బాలిక

  • చిన్నారిపై లైంగిక దాడి
  • వైద్య సంరక్షణ కేంద్రంలో బాలిక, బిడ్డ
  • తనపై జరిగిన దారుణం గురించి చెప్పలేకపోతోన్న బాలిక
  • బిడ్డకు తండ్రి ఎవరన్న విషయాన్ని కూడా  వివరించలేకపోతోన్న వైనం
ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతున్నా.. ఆడపిల్లలకు రక్షణను ఇవ్వడంలో మాత్రం విఫలమవుతూనే ఉంది. కొలంబియాలోని ప్రాడో మునిసిపాలిటిలో ఓ పదేళ్ల బాలిక గర్భం దాల్చి ఓ బిడ్డకు జన్మనివ్వడమే ఇందుకు ఉదాహరణ. అభం శుభం తెలియని ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి.

ఆ బాలికకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ఆమెపై లైంగిక దాడి ప్రారంభమైనట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ బాలిక బిడ్డకు జన్మనిచ్చిన నెల రోజులకు ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చింది. ఆమెను, ఆమె బిడ్డను ప్రస్తుతం ఇబాకో నగరంలోని వైద్య సంరక్షణ కేంద్రంలో ఉంచారు.  

ఈ ఘటనపై కొలంబియా వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. తనపై జరిగిన దారుణం గురించి ఆ బాలిక చెప్పలేకపోతోంది. తన బిడ్డకు తండ్రి ఎవరన్న విషయాన్ని కూడా వివరించలేకపోతోంది. ఆ బాలిక బిడ్డకు జన్మనిచ్చిన విషయం ఆలస్యంగా వెలుగు చూసిందని ఆ ప్రాంత గవర్నర్‌ రికార్డో ఒరోజ్కో తెలిపారు.

దీనిపై కేసు నమోదు చేశామని, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డ వారు ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అనుమానిస్తున్నామని తెలిపారు. ఆ బాలిక సవతి తండ్రి(43), పొలాల్లో పని చేసే మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.


More Telugu News