ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవకు కరోనా పాజిటివ్.. ఎయిమ్స్ లో చేరిక
- వారం రోజుల క్రితమే సోకిన వైరస్
- హోం ఐసోలేషన్‌లో వారం రోజులపాటు ఉన్న భార్గవ
- ప్రస్తుతం నిలకడగా వున్న ఆరోగ్యం
కరోనా నియంత్రణకు పోరాడుతున్న భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డీజీ ప్రొఫెసర్ బలరాం భార్గవ కరోనా బారినపడ్డారు. ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో వైరస్ సోకినట్టు తేలడంతో వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. నిజానికి ఆయనకు వారం రోజుల క్రితమే వైరస్ సంక్రమించినట్టు తెలుస్తోంది. తనలో లక్షణాలు కనిపించిన వెంటనే హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిన భార్గవ వారం రోజుల అనంతరం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు.
కార్డియాలజిస్ట్ అయిన భార్గవ దేశంలో కొవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్న ఐసీఎంఆర్‌కు హెడ్‌గా ఉన్నారు. వ్యాధి నిర్వహణ, నివారణ, వ్యాక్సిన్‌కు సంబంధించిన అన్ని అంశాలను పర్యవేక్షిస్తున్నారు. ఆరోగ్య పరిశోధన విభాగం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగానూ పనిచేస్తున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా.