స్టాలిన్, పళనిస్వామి మధ్య మాటల తూటాలు!
- స్టాలిన్ ను స్టేట్మెంట్ హీరో అన్న పళనిస్వామి
- పళనిస్వామిని అవినీతి హీరో అన్న స్టాలిన్
- అన్నాడీఎంకే పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి పళనిస్వామికి, డీఎంకే అధినేత స్టాలిన్ కు మధ్య మాటల తూటాలు పేలాయి. స్టాలిన్ ను 'స్టేట్మెంట్ హీరో' అంటూ పళనిస్వామి ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ మాట్లాడుతూ పళనిస్వామిపై మండిపడ్డారు.
పళనిస్వామి తనను స్టేట్మెంట్ హీరో అంటున్నారని... అందుకే తాను కూడా ఆయనకు ఒక పేరు పెట్టాలనుకున్నానని... ఆయన 'అవినీతి హీరో' అని అన్నారు. అన్నాడీఎంకే పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆ పార్టీ మాజీ నాయకురాలు శశికళ కూడా అవినీతి కేసుల వల్లే జైల్లో ఉన్నారని విమర్శించారు.
మరోవైపు ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని డీఎంకే సర్వశక్తులను ఒడ్డుతోంది. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అన్నాడీఎంకే శ్రమిస్తోంది. బీజేపీతో పొత్తుకు కూడా రెడీ అంటోంది. మరోవైపు కమలహాసన్ కూడా ఇప్పటికే ప్రచారపర్వంలోకి దిగారు. తాజాగా రజనీకాంత్ కూడా పార్టీని ప్రకటించడంతో తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. ఇదే సమయంలో తమిళనాడులో పోటీ చేసేందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.