కరోనా బారిన పడిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి
- కరోనా వచ్చినట్టు స్వయంగా వెల్లడించిన రావత్
- ప్రస్తుతం బాగానే ఉన్నానని వెల్లడి
- హోమ్ ఐసొలేషన్ లో ఉన్న సీఎం
మన దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటికి చేరువలో ఉంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన ఎందరో రాజకీయ ప్రముఖులు పడ్డారు. తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.
ఈరోజు తాను కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని చెప్పారు. అయితే తనలో కరోనా లక్షణాలు మాత్రం లేవని తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉందని... వైద్యుల సూచన మేరకు హోమ్ ఐసొలేషన్ లో ఉన్నానని చెప్పారు. ఇటీవలి కాలంలో తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
మరోవైపు ఉత్తరాఖండ్ లో ఇప్పటి వరకు దాదాపు 85 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 1400 మంది మరణించారు.