శాంతిభద్రతలు దిగజారిపోయాయంటూ.. ఏపీ డీజీపీకి మరో లేఖ రాసిన చంద్రబాబు!
- ఇటీవల ఏపీ డీజీపీకి వరుసగా లేఖలు రాస్తున్న చంద్రబాబు
- ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపణ
- టీడీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం దారుణమని వ్యాఖ్యలు
- హక్కుల అణచివేతపై పోలీసులు శ్రద్ధ చూపుతున్నారన్న బాబు
ఇటీవల కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు వరుసగా లేఖలు రాస్తున్నారు. ఈ క్రమంలో, ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయంటూ తాజాగా మరో లేఖాస్త్రం సంధించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలు, అణచివేతలు పెరిగిపోయాయని ఆరోపించారు.
ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వమే అసమ్మతిని అణచివేయడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు. అమరావతి పరిరక్షణ కోసం శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న టీడీపీ కార్యకర్తలకు, నేతలకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమని తెలిపారు. టీడీపీ నేతలకు పోలీసులు జారీ చేసిన నోటీసులు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రాథమిక హక్కుల అణచివేతపై కొందరు పోలీసులు శ్రద్ధ చూపుతున్నారంటూ పరోక్ష విమర్శలు చేశారు.