ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన పేర్ని నాని

  • సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ
  • కొద్దిసేపటి కిందట ముగిసిన సమావేశం
  • అనంతరం మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం
  • రూ.1200 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ చెల్లింపుకు ఆమోదం
  • సినీ పరిశ్రమ రీస్టార్ట్ ప్యాకేజీకి ఆమోదం
సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. అనంతరం మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించి మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించారు.

ఏపీ సర్వే అండ్ బౌండరీ చట్ట సవరణకు ఆమోదం తెలిపామని, ప్రతిభూమికి సబ్ డివిజన్ ప్రకారం మ్యాప్ తయారు చేస్తారని తెలిపారు. ఏపీలో కొత్తగా 16 వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇచ్చామని, అటు 27 వైద్య కళాశాలలకు రూ.16 వేల కోట్ల నిధులు మంజూరు చేయనున్నామని వెల్లడించారు. అంతేగాకుండా, కొవిడ్ నేపథ్యంలో సినీ పరిశ్రమకు రీస్టార్ట్ ప్యాకేజి ఇచ్చేందుకు కేబినెట్ అంగీకరించిందని పేర్ని నాని వివరించారు.

కేబినెట్ నిర్ణయాలు ఇవే...

  • రూ.1200 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ చెల్లింపు.
  • ఇన్ పుట్ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు.
  • ఏపీ వైద్య విద్య పరిశోధన కార్పొరేషన్ ఏర్పాటు ఆర్డినెన్స్ కు ఆమోదం.
  • రాష్ట్రంలో నూతన టూరిజం పాలసీకి ఆమోదం.
  • నివర్ తుపాను బాధితులకు ఈ డిసెంబరు చివరిలోగా పరిహారం.
  • రైతులకు ఏ సీజన్ లో పరిహారం ఆ సీజన్ లోనే చెల్లింపు.
  • 6 జిల్లాల్లో వాటర్ షెడ్ అభివృద్ధి పథకం అమలుకు ఆమోదం.
  • టూరిజం ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజి కింద ఆర్థిక సాయం.
  • హోటల్ రంగం పునరుజ్జీవం కోసం రూ.15 లక్షల వరకు రుణం.



More Telugu News