మయన్మార్ సరిహద్దులో 2,000 కిలో మీటర్ల మేర చైనా గోడ
- చైనా చర్యలను ఖండిస్తోన్న మయన్మార్ సైన్యం
- తన తీరును మార్చుకోని చైనా
- 1961 సరిహద్దు ఒప్పందం ఉల్లంఘన అని లేఖ
- చైనా తీరుపై అమెరికా విమర్శలు
చైనా తన దుందుడుకు చర్యలను కొనసాగిస్తోంది. మయన్మార్ సరిహద్దులో 2,000 కిలోమీటర్ల పొడవైన గోడ నిర్మాణాన్ని తలపెట్టి కలకలం రేపింది. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారిని అడ్డుకోవడానికే ఈ గోడ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పుకొస్తోంది.
దక్షిణ సరిహద్దు మయన్మార్ వెంట చైనా ఈ గోడను నిర్మించే పనుల్లో ఉంది. అయితే, మయన్మార్ సైన్యం చైనా చర్యలను ఖండిస్తోంది. సరిహద్దులో గోడ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తోంది. అయినప్పటికీ చైనా తన తీరును మార్చుకోవట్లేదు. దేశ సరిహద్దు వెంబడి 9 మీటర్ల ఎత్తులో ముళ్ల తీగను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతూ ఇటీవలే మయన్మార్ సైన్యం చైనా అధికారులకు ఓ లేఖ రాసింది.
1961 సరిహద్దు ఒప్పందం ప్రకారం.. సరిహద్దుకు 10 మీటర్లలోపు ఎటువంటి నిర్మాణాన్ని చేపట్టకూడదని తెలిపింది. దీనిపై అమెరికా అధికారులు స్పందిస్తూ... మయన్మార్ భూభాగ దురాక్రమణే చైనా ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మయన్మార్ సరిహద్దు వెంట చైనా గోడ నిర్మాణం విస్తరణవాద ఆలోచనను ప్రతిబింబిస్తుందని అన్నారు. చైనా చర్యల కారణంగా భవిష్యత్తులో దక్షిణాసియాలో ఘర్షణలు పెరుగుతాయని పేర్కొంది.