ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. కీలక అంశాలపై చర్చ

  • మొత్తం 26 అంశాలపై కేబినెట్ భేటీలో చర్చ
  • ఏపీలో నూతన పర్యాటక విధానాకి ఆమోదం తెలిపే అవకాశం
  • వైద్య విద్య పరిశోధన కార్పొరేషన్‌ ఏర్పాటుకు కూడా
సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశంలో మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ రోజు మొత్తం 26 అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఇందులో ప్రధానంగా పౌరసరఫరాల కార్పొరేషన్‌ ద్వారా రూ.5 వేల కోట్ల రుణం తీసుకోవడం, ఏపీలో నూతన పర్యాటక విధానంపై చర్చించి ఆమోదం తెలపడం వంటి అంశాలపై చర్చిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్య పరిశోధన కార్పొరేషన్‌ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే, తిరుపతిలో ల్యాండ్‌ సర్వే అకాడమీ, 40 ఎకరాల భూ కేటాయింపు వంటి అంశాలపై మంత్రులతో జగన్ చర్చించనున్నారు. అలాగే, ఇళ్ల పట్టాల పంపిణీ, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతు భరోసా పథకం, ఇన్‌పుట్‌ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్‌ ద్వారా చెల్లింపులు వంటి అంశాలపై చర్చిస్తారు. ఆరు జిల్లాల్లో వాటర్‌ షెడ్ల అభివృద్ధి పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.


More Telugu News