సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ఈ ఏడాది గుర్తుండిపోతుందంటున్న రకుల్!
- 'వకీల్ సాబ్' నుంచి న్యూ ఇయర్ కి 'టీజర్'
- 'కోబ్రా' షూటింగ్ కోసం కోల్ కతా వెళ్లిన విక్రమ్
* 'ఏ విధంగా చూసినా ఈ ఏడాది అందరికీ బాగా గుర్తుండిపోతుంది..' అంటోంది అందాలభామ రకుల్ ప్రీత్ సింగ్. 'లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది చాలా రోజులు అందరం ఇంట్లోనే ఉండిపోవాల్సివచ్చింది. నాకు కూడా కెరీర్లో ఇంత పెద్ద బ్రేక్ ఎప్పుడూ రాలేదు. షూటింగుల వల్ల ఇంట్లో వాళ్లతో ఎక్కువ రోజులు కలసి ఉండడం కుదిరేది కాదు. అలాంటిది ఈ ఏడాది కరోనా వల్ల వీలుపడింది. అందుకే, పదేళ్ల తర్వాత అందరం కలసి హాలిడే కోసం మాల్దీవులకు వెళ్లాం' అని చెప్పింది రకుల్.
* కొంత గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రానికి సంబంధించిన టీజర్ ను న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రం చివరి షెడ్యూలు షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది.
* ప్రముఖ నటుడు విక్రమ్ కథానాయకుడుగా నటిస్తున్న 'కోబ్రా' చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ నేటి నుంచి కోల్ కతాలో జరుగుతుంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ కీలక నెగటివ్ పాత్రలో నటిస్తున్నాడు.