ఎట్టకేలకు కాంగ్రెస్ రెబెల్స్ ను కలిసేందుకు అంగీకరించిన సోనియాగాంధీ
- పార్టీ పతనమవుతోందంటూ హైకమాండ్ కు గతంలో లేఖ రాసిన కొందరు సీనియర్లు
- పార్టీలో కలకలం రేపిన లేఖ
- శనివారం రెబెల్స్ తో భేటీ కానున్న సోనియా
కాంగ్రెస్ పార్టీ పతనం దిశగా వెళ్తోందని, పార్టీలో వ్యవస్థాగతమైన మార్పులను తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ కొంత మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు హైకమాండ్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పార్టీలో కలకలం రేపింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు పార్టీని మరింత కలవరపాటుకు గురి చేశాయి. కొందరు నేతలను పక్కన పెట్టే పరిస్థితులు కూడా వచ్చాయి.
ఈ నేపథ్యంలో, రెబెల్ నేతలతో సమావేశమయ్యేందుకు ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఎట్టకేలకు అంగీకరించారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర వహించారు.
సమావేశానికి సంబంధించిన లేఖపై 23 మంది నేతలు సంతకం చేశారు. అయితే వీరందరూ సోనియాను కలవడం లేదు. ఐదు లేదా ఆరు మంది కీలక నేతలు మాత్రమే సమావేశానికి హాజరుకానున్నారు. శనివారం ఈ సమావేశం జరగనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ భేటీకి రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు హాజరవుతారా? లేదా? అనే విషయంలో కూడా క్లారిటీ లేదు.
అయితే మరోవైపు ఇంకో వార్త కూడా వినిపిస్తోంది. లెటర్ పై సంతకం చేసిన నాయకులంతా సోనియాతో భేటీ అవుతారని కొందరు చెపుతున్నారు.