ఎట్టకేలకు సాగర్ ను కలిశాను: కల్వకుంట్ల కవిత ఆనందం

  • 2017లో తీవ్ర అనారోగ్యానికి గురైన సాగర్ అనే బాలుడు
  • కాలేయ మార్పిడి చేయాలన్న వైద్యులు
  • రూ.26 లక్షల ఎల్వోసీ మంజూరు చేయించిన కవిత
  • కవితను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సాగర్, కుటుంబసభ్యులు
  • సాగర్ కు దీర్ఘాయుష్షు కలగాలంటూ కవిత ఆకాంక్ష
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ కు చెందిన సాగర్ అనే బాలుడు తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకున్నాడు. 2017లో ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవిత ప్రాణాపాయ స్థితిలో ఉన్న సాగర్ పట్ల మానవీయ దృక్పథంతో స్పందించి ఆదుకున్నారు. అధికారులతో మాట్లాడి సాగర్ శస్త్రచికిత్స కోసం రూ.26 లక్షల ఎల్వోసీ మంజూరు చేశారు. సాగర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్యాధికారులతో మాట్లాడుతూ ఎంతో శ్రద్ధ చూపించారు.

కాగా, కాలేయ మార్పిడి తర్వాత ఆరోగ్యవంతుడైన నేపథ్యంలో సాగర్, అతని కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై కవిత స్పందించారు. ఎట్టకేలకు సాగర్ ను కలిశానని ట్విట్టర్ లో వెల్లడించారు. చిన్నవయసులోనే కాలేయ మార్పిడి చేయించుకుని ఇప్పుడు పరిపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడని చెప్పడానికి గర్విస్తున్నానని పేర్కొన్నారు. అతడికి భగవంతుడు దీర్ఘాయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని కవిత ఆకాంక్షించారు.


More Telugu News