అబ్బురపరుస్తున్న అంతరిక్షం నుంచి తీసిన హిమాలయాల ఫొటో

  • అంతరిక్ష కేంద్రం నుంచి ఫొటో తీసిన క్రూమెంబర్
  • విద్యుత్ కాంతితో వెలిగిపోతున్న ఢిల్లీ
  • సోషల్ మీడియాలో ఫొటోను షేర్ చేసిన నాసా
అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా అంతరిక్షం నుంచి హిమాలయ పర్వతాల అందాలని క్లిక్ మనిపించింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి తీసిన ఫొటోను నాసా విడుదల చేసింది. ఈ ఫొటోను స్పేస్ స్టేషన్ లో ఉన్న ఓ క్రూ మెంబర్ తీశారు. ఈ ఫొటోలో విద్యుద్దీపాలతో వెలిగిపోతున్న ఢిల్లీ నగరం కూడా కనిపిస్తోంది.

ఇండియన్, యూరేసియన్ టెక్టానిక్ ప్లేట్లు 5 కోట్ల సంవత్సరాలుగా గుద్దుకోవడం వల్ల ప్రపంచంలోనే ఎత్తైన హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయని ఫొటోకు సంబంధించి నాసా పేర్కొంది. పర్వతాలకు దక్షిణాన లేదా ఫొటోలో కనిపిస్తున్న కుడిపక్కన భారత్, పాకిస్థాన్ లకు చెందిన సారవంతమైన వ్యవసాయ భూములు ఉన్నాయని చెప్పింది. పర్వతాలకు ఉత్తరాన టిబెట్ పీఠభూమి ఉందని తెలిపింది. చిత్రంలో విద్యుత్ దీపాలతో వెలుగుతున్నవి ఇండియాలోని ఢిల్లీ, పాకిస్తాన్ లోని లాహోర్ అని పేర్కొంది.


More Telugu News