విశాఖలో త్వరలోనే జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్: మేకపాటి గౌతమ్ రెడ్డి

  • విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా టౌన్ షిప్
  • ప్రత్యేకంగా జపాన్ డెస్కును ఏర్పాటు చేస్తాం
  • జపాన్ కంపెనీలకు రాయితీలు ఇస్తాం
విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ను అభివృద్ది చేయబోతున్నామని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా విశాఖలో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ ను నిర్మించనున్నట్టు వెల్లడించారు. ఈరోజు భారత పరిశ్రమల సమాఖ్య భాగస్వామ్య సదస్సును నిర్వహించింది. వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగిన ఈ సదస్సులో గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, ఈ విషయాన్ని వెల్లడించారు.

పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా జపాన్ డెస్కును ఏర్పాటు చేస్తామని గౌతమ్ రెడ్డి చెప్పారు. శ్రీసిటీ సెజ్ లో ఇప్పటికే ఓ జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ ఉందని తెలిపారు. చైనా నుంచి వైదొలగి ఏపీలో పెట్టుబడులు పెట్టే జపాన్ కంపెనీలకు రాయితీ ఇస్తామని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడం కోసం జపాన్-ఇండియా తయారీ సంస్థ (జిమ్)ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.


More Telugu News