ఓ వైపు జనభేరి సభ జరుగుతుంటే.. దుర్మార్గుడు బీసీల సభ పెట్టాడు: అచ్చెన్నాయుడు
- జగన్ పై నిప్పులు చెరిగిన అచ్చెన్నాయుడు
- ఈ మూర్ఖపు సీఎం ఆనాడు అమరావతిని ఒప్పుకున్నాడని వ్యాఖ్య
- అమరావతి రైతులకు జగన్ క్షమాపణలు చెప్పాలి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అమరావతిలో ఓ వైపు జనభేరి సభ జరుగుతుంటే... దుర్మార్గుడు బీసీల సభ పెట్టాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మూర్ఖపు ముఖ్యమంత్రే ఆనాడు అమరావతిని ఒప్పుకున్నాడని... ఇప్పుడు మాట తప్పి మాట్లాడుతున్నాడని విమర్శించారు.
కొందరు చేతకాని దద్దమ్మలు తనను రాజీనామా చేయమంటున్నారని... రాజీనామా చేయాల్సింది తాను కాదని, ఈ ప్రభుత్వం చేయాలని అన్నారు. రాజధాని అమరావతిని హత్య చేసి నేటికి ఏడాది పూర్తయిందని చెప్పారు. రాజధానిగా అమరావతే ఉంటుందని ప్రకటించేంత వరకు ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. అమరావతి లాంటి ఉద్యమం ప్రపంచంలోనే లేదని చెప్పారు. జగన్ రెడ్డి దుర్మార్గుడని... ఈ మూర్ఖపు ముఖ్యమంత్రిని గద్దె దింపాలని పిలపునిచ్చారు. జగన్ లెంపలేసుకుని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.