ఎట్టకేలకు చంద్రబాబుకి అనుమతినిచ్చిన పోలీసులు.. అమరావతికి శంకుస్థాపన చేసిన స్థలం సందర్శన
- ఉద్దండరాయునిపాలేనికి వెళ్లిన చంద్రబాబు
- కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలకు మాత్రమే అనుమతి
- అమరావతి రాజధాని శిలాఫలకం పరిశీలన
- శంకుస్థాపన చేసిన ప్రదేశంలో జై అమరావతి అంటూ నినాదాలు
విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి ఉద్దండరాయునిపాలెం బయల్దేరిన విషయం తెలిసిందే. అయితే, ఉద్దండరాయునిపాలేనికి అనుమతి లేదని మొదట చెప్పిన పోలీసులు.. అనంతరం కొన్ని షరతులతో అక్కడికి వెళ్లడానికి ఆయనకు అనుమతి నిచ్చారు.
కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలను మాత్రమే అనుమతించారు. దీంతో చంద్రబాబు ఉద్దండరాయునిపాలేనికి వెళ్లి అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని సందర్శించారు. అక్కడి శిలాఫలకాన్ని పరిశీలించారు. శంకుస్థాపన చేసిన ప్రదేశంలో జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అనంతరం రాయపూడిలో జరుగుతోన్న జనభేరి సభకు బయలుదేరారు.