పదేపదే జలుబుతో బాధపడేవారికి కరోనా ముప్పు తక్కువ.. పరిశోధనలో వెల్లడి

  • గుర్తించిన యూనివర్సిటీ ఆఫ్‌ రోచెస్టర్‌ మెడికల్ సెంటర్
  • రైనో, పారా ఇన్‌ప్లుయెంజా వంటి వైరస్‌ల వల్ల జలుబు
  • కొన్ని రకాల కరోనా వైరస్‌ల వల్ల కూడా జలుబు
  • రోగ నిరోధక శక్తిపెరిగి కరోనాపై వెంటనే దాడి
మీకు తరుచూ జలుబు చేస్తుందా? అయితే, కొవిడ్-19 విజృంభణ పరిస్థితుల్లో అటువంటి జలుబు మంచిదేనని యూనివర్సిటీ ఆఫ్‌ రోచెస్టర్‌ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఆ జలుబే మిమ్మల్ని కరోనా నుంచి రక్షిస్తుందని అంటున్నారు.

ఎందుకంటే రైనో, పారా ఇన్‌ప్లుయెంజా వంటి వైరస్‌ల వల్ల జలుబు వస్తుంది. అలాగే, కొన్ని రకాల కరోనా వైరస్‌ల వల్ల కూడా జలుబుతో బాధపడతాం. జలుబు వస్తే మనుషుల శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుందని, దీంతో  కరోనా‌ వైరస్‌ నుంచి దీర్ఘకాలిక రక్షణ లభిస్తుందని పరిశోధకులు గుర్తించారు.

కొన్ని సందర్భాల్లో జీవితకాలం మొత్తం కరోనా  నుంచి రక్షణ లభిస్తుందని చెప్పారు. కరోనా వల్ల జలుబు చేసిన రోగుల్ని పరిశీలించి చేసిన అధ్యయనంలో ఈ విషయం తెలిసిందని చెప్పారు. ఆ వైరస్‌ను ఎదుర్కొనే రోగ నిరోధక వ్యవస్థలోని మెమొరీ బి కణాలు వైరస్‌లను గుర్తు పెట్టుకుని, అటువంటి వైరస్ శరరీంలోకి ప్రవేశించిన వెంటనే  స్పందించి యాంటీ బాడీలను విడుదల చేస్తాయి. శరీరంలో ఈ కణాలు దశాబ్దాల తరబడి జీవించి ఉంటాయి. ఈ కారణంగా తరుచూ జలుబు చేసే వారికి కరోనా ముప్పు తక్కువగా ఉంటుందని చెప్పారు.


More Telugu News