చంద్రుడి రాళ్లు, మట్టి నమూనాలతో భూమిని చేరిన చైనా వ్యోమనౌక
- మూడు రోజుల క్రితం నమూనాలతో భూమికి బయలుదేరిన చైనా వ్యోమనౌక
- రెండు కేజీల బరువున్న రాళ్లు, మట్టితో సురక్షితంగా ల్యాండింగ్
- నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి భూమికి చేరిన చంద్రుడి నమూనాలు
చంద్రుడిపై పరిశోధనల కోసం చైనా పంపిన ‘చాంగే-5’ వ్యోమనౌక గత అర్ధరాత్రి సురక్షితంగా భూమిని చేరింది. వస్తూవస్తూ దాదాపు రెండు కిలోల బరువున్న మట్టి, రాళ్ల నమూనాలను మోసుకొచ్చింది. మూడు రోజుల క్రితం చంద్రుడి నుంచి బయలుదేరిన ఈ వ్యోమనౌక మంగోలియాలోని సిజువాన్ జిల్లాలో ఇది భూమిపై ల్యాండైంది. ఇది తీసుకొచ్చిన రాళ్లు, మట్టిని విశ్లేషించడం ద్వారా గత పరిశోధనల్లో అంతుచిక్కని ఎన్నో విలువైన విషయాలను తెలుసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
నాలుగు దశాబ్దాల తర్వాత ఇటీవల చంద్రుడిపైకి చైనా మానవరహిత వ్యోమనౌకను పంపింది. ఈ నెల మొదట్లో అది చంద్రుడిపై దిగింది. చివరిసారి సోవియట్ యూనియన్‌కు చెందిన లూనా 24 ప్రోబ్ 1976లో చంద్రుడిపై నుంచి నమూనాలు తీసుకొచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు చైనా విజయవంతంగా ఆ పని పూర్తి చేసింది. అమెరికా, సోవియట్ యూనియన్ వ్యోమనౌకలు భూమికి తీసుకొచ్చిన నమూనాలతో పోలిస్తే చైనా వ్యోమనౌక మోసుకొచ్చిన నమూనాలు బిలియన్ సంవత్సరాల తక్కువ వయసున్నవి కావొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.